1–2cups | ఎక్కువ తాగితే ఏమౌతుంది?
1–2cups | ఎక్కువ తాగితే ఏమౌతుంది?
1–2cups | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉరుకుల పరుగుల జీవనంలో చాలామంది అలసటకు గురై టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వీటిని వేసవిలో తాగడం మంచిదా…? కాదా..? అనేది చాలామందిలో అనుమానం ఉంటుంది. అయితే టీ, కాఫీలను వేసవిలో మితంగా తాగడం మంచిదే కానీ, ఎక్కువైతే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చునని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తగ్గించడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. ఎందుకంటే కెఫిన్ శరీరం నుంచి నీటిని తగ్గిస్తుంది.
- రోజుకు 1-2 కప్పులకు పరిమితం చేయండి.
- టీ, కాఫీలు తాగిన తర్వాత ఎక్కువ నీరు తాగడం ద్వారా శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేసుకోవాలి.
- ఉదయం వేళల్లో తాగడం మంచిది, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నిద్రకు భంగం కలిగించవచ్చు.
- టీ కాఫీలకు బదులు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పుదీనా టీ వంటి చల్లబరిచే పానీయాలు తీసుకోవడం మంచిది.
- టీ, కాఫీలలోని కేఫీన్ డైయూరెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది,
- దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన కలిగించి శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.
- ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఇబ్బందులు, అజీర్తి రావచ్చు.
- వేసవిలో ఐస్‌డ్ కాఫీ, ఇతర చల్లటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం మంచిది.
- టీలో టానిన్, కెఫిన్ వంటి పాలీఫెనోల్స్ ఉంటాయి.
- ఎక్కువ చాయ్ తాగితే ఈ పాలీఫెనోల్స్ శరీరం ఐరన్, విటమిన్లు, ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
- ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తగ్గించడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. ఎందుకంటే కెఫిన్ శరీరం నుంచి నీటిని తగ్గిస్తుంది.
