సైకిల్ పై ఎమ్మెల్యే పల్లెబాట..
పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం పామర్రు టౌన్ కోటిరెడ్డి పేటలో పల్లెబాట 2.0 మీ కోసం – మీ ఎమ్మెల్యే’ సైకిల్ పై పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు సులభంగా చెప్పగలిగేలా 24/7 అందుబాటులో ఉండేలా వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ 9908833636ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు స్వయంచాలకంగా రికార్డు అవుతాయి మరియు సంబంధిత అధికారులకు వెంటనే అందుతాయి. నా నియోజకవర్గ ప్రజల సమస్యలు నా సమస్యలు. పల్లె పల్లెకు, గ్రామ గ్రామానికి చేరుకుని సేవ చేయాలని పల్లెబాట 2.0 కార్యక్రమం ద్వారా నిర్ధారిస్తున్నాను. సైకిల్ పై పర్యటనలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు త్వరగా పరిష్కారాలు కల్పిస్తాను” అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా రోడ్డులు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రధాన దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి ఈ వాట్సాప్ నెంబర్ 9908833636కు సంప్రదించవచ్చు అని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు వారితోపాటు అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
