4yrsShriyan | దేవరుప్పుల మండలంలో విషాదం
4yrsShriyan | దేవరుప్పుల మండలంలో విషాదం
4yrsShriyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ముండిచింతతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
శ్రియాన్(4) అనే బాలుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి రెండు విష సర్పాలు కాటేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట నాగుపాము కాటేయగా, కొద్దిసేపటికే మరో విష సర్పమైన రక్తపింజరి కూడా కాటు వేసినట్లు సమాచారం.
బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు పాముల విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రికి చేరుకునేలోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
