March 2027 | డబ్బు సృష్టించేందుకు కృషి చేయండి
March 2027 | డబ్బు సృష్టించేందుకు కృషి చేయండి
కలెక్టర్లకు చంద్రబాబు హితబోధ
ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయాలి
రోజుకో కొత్త కంపెనీ తెస్తున్నాం
తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా వచ్చేసింది
March 2027 | అమరావతి, ఆంధ్రప్రభ : అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే ఏడోవ జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని గురువారం సీఎం ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు.
March 2027 | అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..

ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. అధికారులు సమష్టిగా పనిచేసి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను వందశాతం పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. ఏపీని పునఃనిర్మిస్తామని తాను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు.
అందరి సహకారంతో రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని.. ఇది సమష్టి విజయమని ఉద్ఘాటించారు. ఈ అవార్డు తనకు బాధ్యతతో కూడినది అని.. నిజానికి ఇలాంటి అవార్డులు పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని వ్యాఖ్యానించారు. మీ అందరి సహకారంతోనే తనకు ఈ అవార్డు వచ్చిందని అన్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారని… ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారనే దానికి ఈ అవార్డు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. మంత్రులు, సీఎస్ మొదలుకుని… గ్రామస్థాయి అధికారి వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గత పాలనలో రాష్ట్రం విధ్వంసం ..
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “గత పాలకుల నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మనకు సంక్రమించాయి. అంతేకాకుండా, 94 కేంద్ర పథకాల నుంచి సుమారు రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. చెల్లించాల్సిన బిల్లులు రూ.1.30 లక్షల కోట్లు కూడా మనపైనే రుద్దారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడి విధ్వంసమయ్యాయి” అని చంద్రబాబు వివరించారు.
March 2027 | సంపద సృష్టితోనే సంక్షేమం..
ప్రస్తుతం తమ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. “సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివి. అభివృద్ధి లేకుండా సంపద రాదు, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. డబ్బులు లేవని కూర్చోవడం కాదు, సంపదను సృష్టించే పని చేయాలి, చేద్దాం” అని అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వం విజయవంతమవుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ల మధ్య, జిల్లాకు జిల్లాకు మధ్య పోటీ ఉండాలని సీఎం సూచించారు. ఇన్నోవేటివ్ ఐడియాలు తీసుకువస్తే అధికారులను మెంటర్‌గా నియమిస్తామని చెప్పుకొచ్చారు. ఎంతవేగంగా పనులు చేస్తే అంతేవేగంగా ఫలితాలు వస్తాయని సూచించారు. ప్రతి ఫైలులోని సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు రిజల్ట్ ఓరియెంటేషన్‌తో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలి..
పరిపాలనలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. “ప్రజల నుంచి వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులను 100 శాతం పరిష్కరించాల్సిందే. కొందరు అధికారులు వాటిని పైకి కిందకు తిప్పుతున్నారు, ఈ వైఖరి మారాలి. ఆర్థికపరమైన ఫిర్యాదులపైనా విచారణ జరిపి, అర్హమైన వాటిని వెంటనే పరిష్కరించాలి. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలి” అని అధికారులకు గడువు విధించారు.
March 2027 | రాయల్ ఎన్ఫీల్డ్ను తీసుకువచ్చాం..
రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులను ఏపీకి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. గ్రీన్ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రూ.23లక్షల కోట్ల ఎంవోయూలు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఎంవోయూల ద్వారా 24లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. దేశంలోని అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. వారానికో కంపెనీ తీసుకొస్తున్నామని.. రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
డబ్బును సృష్టించండి..
ప్రజాప్రతినిధులు, అధికారుల కలయికే కూటమి ప్రభుత్వమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో డెలివరీ లీకేజిలు ఎక్కువగా ఉండేవని… ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయని వివరించారు. జగన్ హయాంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రోడ్ల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు కలెక్టర్ రిపోర్టు పంపేవారని.. అయితే వారు ఇప్పుడు పంపక్కరలేదని… తామే పంపిస్తామని అన్నారు. ప్రజాసమస్యలు అన్నింటిని పాజిటివ్‌గా పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవస్ధను మ్యానేజ్ చేయడానికి కాదని.. దాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం ఉందని తెలిపారు. డబ్బు లేదనేది నిజం కాదని… డబ్బును సృష్టించి పనులు చేయించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సమాచార శాఖ పనితీరుపై ఆగ్రహం..
ఐ అండ్ పీఆర్ శాఖపై పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ కేవలం ప్రభుత్వానికి ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాను ఈ శాఖ అధికారులు ఎందుకు వాడుకోవడం లేదని ప్రశ్నించారు. వారి సర్వీసులను ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇది డబల్ ఎడ్జి వెపన్ అటు ఇటు వాడుతారని.. అలాంటప్పుడు వాటిని సరిగా ఎందుకు కౌంటర్ చేయట్లేదని ప్రశ్నించారు.
