విద్యార్థులకు నాణ్యమైన సేవల దిశగా అడుగులు

విద్యార్థులకు నాణ్యమైన సేవల దిశగా అడుగులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో మరింత పారదర్శకత పెంచేందుకు, పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని మధ్యాహ్న భోజన బిల్లులను టీబీఆర్ నంబర్ కాపీలతో సహా ఎస్టీఓ కార్యాలయాల్లో వెంటనే సమర్పించాలని డైరెక్టర్ ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, సాంకేతిక ఇబ్బందులు, భవిష్యత్తులో చేపట్టబోయే మార్పులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏదైనా కారణం చేత బిల్లులు తిరస్కరించినట్టయితే సంబంధిత స్కూల్ కోడ్, టీవీఆర్ నంబరు సపోర్ట్ టీమ్కు లేదా డైరెక్టర్ కార్యాలయానికి ఈమెయిల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చుని సూచించారు. పాఠశాలలపై వోచర్ల కోసం ఒత్తిడి తేవద్దని, అలాంటి సందర్భాల్లో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
పర్యవేక్షణ మరింత కఠినం
ధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 6-8 తరగతులకు, 9-10 తరగతులకు బియ్యం లెక్కలను వేర్వేరుగా చూపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ప్రీ-ప్రైమరీ నివేదికలను కూడా ఏకీకృతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పథకం అమలులో ఎదురయ్యే అత్యవసర సమస్యల పరిష్కారం కోసం, బడ్జెట్ సమస్యలు ఉన్న జిల్లా అధికారులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల మధ్య అపాయింట్మెంట్ తీసుకోవచ్చని తెలిపారు. అత్యవసరమైతే నేరుగా 9849005173 నంబర్కు మెసేజ్ పంపాలని సూచించారు.

సాంకేతిక సమస్యలకు చెక్
హెడ్ మాస్టర్లకు ఎస్ఎంఎస్ లు రాకపోవడం వంటి సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, స్కూల్ కోడ్ వివరాలతో సపోర్ట్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. బిల్లుల స్థితిగతులను ట్రాక్ చేసేందుకు ఇప్పటికే హెచ్ఎం, మండల స్థాయిల్లో ఎక్సెల్ రిపోర్టులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డైరెక్టర్ హెచ్చరించారు. ఈ మార్పుల ద్వారా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మరింత సులభతరం, విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందుతాయని విద్యాశాఖ భావిస్తోంది.