అవగాహనతోనే ప్రమాదాల నివారణ

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చునని మండల విద్యుత్ అధికారి పాండు మంగళవారం అన్నారు. మండల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నర్సింహులపేట మండల కేంద్రంలో మే 1 నుంచి 7వ తేది వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లలో వాడే విద్యుత్ వైరింగ్ నాణ్యమైనది వాడాలని,నాసిరకం విద్యుత్ పరికరాలు ఉపయోగించడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని, రైతుల మోటార్ల వద్ద కూడా తరుచుగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఐఎస్ఐ మార్కు ఉన్న ఫ్యూఫీజులు వాడాలని సూచించారు.నాణ్యమైన విద్యుత్ వైర్లను వాడి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ చలమయ్య,సిబ్బంది సుధాకర్, అశోక్, నాగేష్, వెంకన్న, రఫీ తదితరులు పాల్గొన్నారు.