100places | విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
100places | విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
100places | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా ముందంజలో కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ఇతర వాహనాలను ఆ ప్రాంతానికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఎన్నికల ట్రెండ్స్‌లో డీఎంకే కూటమి అనూహ్యంగా మూడో స్థానంలో కొనసాగడం విశేషం. అధికార పోరులో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో ఈ మార్పులు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

