వరంగల్లో జరుగే రైతు సదస్సును విజయవంతం చేయండి..

వరంగల్లో జరుగే రైతు సదస్సును విజయవంతం చేయండి..

కేసముద్రం, ఆంధ్రప్రభ : ఈనెల 6న రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వరంగల్లో జరుగు రైతు సదస్సును కేసముద్రం మండలం నుండి రైతులు , ప్రజాప్రతినిధులు , పార్టీ బాధ్యులు ,మాజీ ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలుభారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మండల పార్టీ పిలుపునిస్తోందనీ ఆ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ నజీర్ అహ్మద్ అన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటైన ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షత రైతులు పడుతున్న బాధలను అర్థం చేసుకోకుండా ప్రవర్తించడంపై ప్రభుత్వాన్ని మేలుకోల్పడానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పటికీ రైతు పక్షపాతి రైతుల యొక్క బాధలను తెలియజేయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం అని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు డాక్టర్ నజీర్ అహ్మద్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం తమకు హస్తగతమైనగా ప్రజా సంక్షేమాన్ని రైతు సంక్షేమాన్ని మరచి పరిపాలన కొనసాగిస్తున్నారు . ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారిచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేసినారు .రైతులు పండించిన మొక్కలకు వెంటనే కొనుగోలు చేసి వారి బాధలను తీర్చాలని ఈ సభ ద్వారా తెలియజేయడానికి సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున రైతులందరూ భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు . టిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం రైతు సంక్షేమం ప్రజలకు గాని రైతులకు గాని ఉద్యోగస్తులకు గాని ఎలాంటి ఆపద కలిగిన వారి వెంట ఉండి ప్రభుత్వంతో పోరాటం చేసి రైతుల బాధలను తొలగించడానికి పోరాటం చేస్తుందనీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ , టౌన్ పార్టీ అధ్యక్షులు గూగుల్లోత్ వీరు నాయక్, జాటోత్ హరీశ్ నాయక్,ఊకంటి యాకూబ్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.