may3 | నేడు నీట్‌ పరీక్ష

may3 | నేడు నీట్‌ పరీక్ష

may3 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నేడు (మే 3, 2026) ఆదివారం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ 2026 పరీక్ష జరుగుతోంది. వైద్యవిద్యలో ప్రవేశం కోసం నేడు నిర్వహిస్తున్న నీట్ యూజీకి సర్వం సిద్ధంమైంది. నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా జరిగేలా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

పరీక్షా సమయం: మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00
రిపోర్టింగ్ సమయం: ఉద‌యం 11గంట‌ల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
గేట్ క్లోజింగ్ సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
నిబంధనలు: విద్యార్థులు అడ్మిట్ కార్డు (NTA NEET), గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.

Leave a Reply