భక్తాంజనేయ దేవాలయంలో శివలింగ ప్రాణ ప్రతిష్ఠ
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోనీ వల్లబ్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం శివలింగ ప్రాణ ప్రతిష్ఠ లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వల్లబ్ నగర్ గ్రామ కమిటీ అభివృద్ధి ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న శ్రీ మహాదేవ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ ము పరిహార దేవత, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాల ను నిర్వహించారు.
నేడు వల్లబ్ నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు శివ లింగ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతికి ఘన స్వాగతం వేద పండితులు,వల్లబ్ నగర్ గ్రామ కమిటీ సభ్యులు, శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కౌన్సిలర్ బీరం భారత్ రెడ్డి సాధారంగా ఆహ్వానించా రు.
అర్చకులు ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు నిర్వహించి నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారో గ్యాలతో,అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దొంతికి తీర్థ ప్రసాదాలు అందించి, వేదాశీర్వచనం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
