వృత్తి నిబద్ధతే అసలైన గుర్తింపు: ఏడి అశోక్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రదర్శించే వృత్తి నిబద్దత సేవా దృక్పథమే.. వారికి జీవితాంతం చెరగని గుర్తింపునిస్తాయని టీజీ ఎన్పీడీసీఎల్ ఏడి పోడేటి అశోక్ అన్నారు. హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ లో పదవి విరమణ చేసిన సీనియర్ లైన్ మెన్ ఎనబోతుల రామ్ మోహన్ ను హసన్ మండల విద్యుత్ ఉద్యోగులు ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు రామ్ మోహన్ దంపతులను పూలమాలలు ,శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఏడి అశోక్ మాట్లాడుతూ.. రామ్మోహన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ లో గత 33 ఏళ్ళుగా సుదీర్ఘ సేవలందించి అంకితభావం, క్రమశిక్షణతో నిరాడంబర జీవితం గడిపిన మృదుస్వభావి ,స్నేహశీలి, శ్రేయోభిలాషి అని కొనియాడారు.అందరి మన్ననలను పొంది పదవి విరమణ పొందిన, రామ్మోహన్ ను ప్రస్తుత ఉద్యగులు ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. ఉద్యోగానికి మాత్రమే విరమణ అని,సేవకు కాదన్నారు.వారు జీవితాంతం ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ లు శిరీష్ కుమార్, సత్యనారాయణ, తరుణ్, లైన్మెన్ లు రాజమౌళి, రవీందర్, రాజ్ కుమార్, రాజు, కిషన్ , వాజిద్,రమేష్, శ్రీను,విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply