Platforms | భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు!

Platforms | భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు!

Platforms | విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ: నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారమ్‌ల వద్ద భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్‌లోని 48, 49, 50 నంబర్ ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడ ఉన్న AC యూనిట్లలో షార్ట్ సర్క్యూట్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply