Students | ఆధార్ బ‌యోమెట్రిక్ అప్‌డెట్ త‌ప్ప‌నిస‌రి

Students | ఆధార్ బ‌యోమెట్రిక్ అప్‌డెట్ త‌ప్ప‌నిస‌రి

Students | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ః నీట్ యూజీ (NEET UG) అడ్మిట్ కార్డులను రేపు విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులకు ఈ కార్డులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పరీక్ష కేంద్రాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేందుకు, విద్యార్థులు తమ ఆధార్ బయోమెట్రిక్ తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని NTA సూచించింది.కాగా, నీట్ పరీక్ష మే 3వ తేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలతో పాటు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.

Leave a Reply