CM | పెట్రోల్ బంకుల మూసివేతపై సమీక్ష

CM | పెట్రోల్ బంకుల మూసివేతపై సమీక్ష

CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఇంధన కొరత పరిస్థితులపై అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, పెట్రోల్ బంకుల మూసివేతతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఇంధన కొరత వల్ల ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.