పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించండి

పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించండి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రైతుకు ఆదాయాన్ని పెంచే విధంగా పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించాలి ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు తెలిపారు. మండలంలోని మోపిడి గ్రామంలో తిరుమల ప్రసాద్ అనే రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారా 12 ఎకరాలలో సాగు చేసిన చీని తోటను, ఇతర పంటలను శుక్రవారం ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతు సహాయ కేంద్ర
సిబ్బంది కలిసి సందర్శించారు.
అనంతరం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ, ఏవో లు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వలన, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందు వలన వర్షాబావ పరిస్థితులను తట్టుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం లో మూడు రకాల పద్ధతుల ను ప్రతిపాదించడం జరిగిందన్నారు. పిఎండిఎస్, అర్థచంద్రాకారం పద్ధతి, వ్యవసాయం నుంచి ఫలసాయ పంటలను సాగు చేయుట పీఎండిఎస్ అనగా రుతు పవనాల కంటే ముందు గానే విత్తనాలను భూమిలో చల్లడం లేదా గొర్రుతో విత్తనం వేయడం ద్వారా వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తే అవకాశం ఉన్నదన్నారు.
ఈ పద్ధతిలో సాగు చేసే ప్రధాన పంటలు ఆముదం, జొన్న సద్ద, కంది, పెసలు మినుము లు, అలసంద లాంటి పంటల ను సాగు చేసే అవకాశం ఉందన్నారు. విత్తనాలను బంకమట్టితో గుళికలుగా తయారు చేసి భూమిలో విత్తు కొనడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకొని, మొలకెత్తి నీటి ఎద్దడిని, తట్టుకొని మొలకెత్తి దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు.
అర్ధ చంద్రకార సాగు పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం వాలుగా ఉన్న నేలలలో వాలుకు అడ్డంగా దున్నడం ద్వారా నీటిని భూమిలోకి ఇంకింప చేసే అవకాశం ఉందని తెలిపారు. వాలుకు అడ్డంగా కందకాలు తయారుచేసి ఆ ఖండకాలలో విత్తనాలను వేసి సాగు చేసే పద్ధతి దీని ద్వారా భూమి క్షయాన్ని మరియు నీటి వృధాను అరికట్టి పంటలకు తేమను నిల్వ చేసి నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసా యం నుంచి ఫలసాయ పంటల సాగు రైతుకు ఆదాయాన్ని పెంచే విధంగా పండ్లతోటల పెంపకాలను ప్రోత్సహించడం అన్నారు. ఉరవకొండ మండలంలో 4,400 హెక్టార్లలో మూడు పద్ధతులలో ప్రకృతి వ్యవసాయం చేయుటకు
ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు.
