ఆదమరిస్తే అంతే….

వాహనదారులు జర జాగ్రత్త

శావల్యాపురం, ఆంధ్రప్రభ : వాహనదారులు ఆదమరిచి వాహనం నడిపితే ఆసుపత్రి పాలవాల్సిందే. మండలంలోని కారుమంచి నుండి మతుకుమల్లి వెళ్ళు ప్రధాన రహదారి చెరువుగట్టుపై రోడ్డు కోతకు గురైంది. రెండు మూడు చోట్ల రోడ్డు అంచు వరకు కోతకు గురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదమర్చి వాహనం నడిపితే అంతే అన్నట్లు తయారైంది. దీనిపై నాయకులు, అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కోతకు గురైన రోడ్డు వెంబడి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.