93.12record | ఈవీఎంలో బందీ అయిన నేతల భవితవ్యం

93.12record | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తమిళనాడులో 234 నియోజకవర్గ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ 152 నియోజక వర్గ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు ప్రశాంత వాతవరణంలో జరిగింది. ఎండలను సైతం లెక్కచేయకుండా ఉదయం 7 గంటల నుంచే బారులు ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు బారులుతీరారు. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో నిలబడి ఉన్న వారికి మాత్రమే అధికారులు టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పించారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తమిళనాడులో పోలింగ్ సమయం ముగిసే సరికి 82.24, పశ్చిమ బెంగాల్ లో 89.93 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చెన్నైలో 81.34 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దినాజ్ పుర్ లో 93.12 నమోదైంది. అధికారులు సాయంత్రం 6 గంటల ముందు పోలింగ్ కేంద్రాలలో లైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగియడంతో వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం (EVM)లలో నిక్షిప్తమైంది. ఇక అందరి కళ్లు మే 4న వెలువడనున్న ఫలితాలపైనే ఉన్నాయి.
ఎన్నికల పోలింగ్ లో చిత్రాలు..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ ప్ర్రక్రియలో పలుచోట్ల ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్నిచోట్ల ఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.
వెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దన్న ‘టీనా’ అనే రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ రోబో సంప్రదాయ దుస్తుల్లో ఓటర్లకు స్వాగతం పలుకుతోంది. చాక్లెట్స్ పంచుతూ ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం. ‘హ్యూమనాయిడ్ రోబోలు’ ఓటర్లకు పూలు, చాక్లెట్లు ఇస్తూ స్వాగతం పలకడం ఈ ఎన్నికలకే హైలైట్‌గా నిలిచింది. ఇవి ఓటర్లకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు కూడా సూచించాయి.
బూత్‌లలో ‘రోబో’ల స్వాగతం..
క్యూలైన్లలో కోలీవుడ్ స్టార్స్…

సామాన్యులతో పాటు సినీ, రాజకీయ తారలు క్యూలైన్లలో నిలబడి ఓటేశారు. రజనీకాంత్, అజిత్, కమల్ హాసన్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. తన పార్టీ ‘టీవీకే’ (TVK) తరఫున తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన దళపతి విజయ్ నీలాంకరైలో ఓటేశారు.
పెళ్లి పీటల నుంచి పోలింగ్ బూత్‌కు..

ప్రజాస్వామ్యం పట్ల తమకున్న బాధ్యతను చాటుతూ.. పలుచోట్ల నూతన జంటలు పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. మెడలో పూలమాలలతో వారు సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పశ్చిమ బెంగాల్ పలుచోట్ల ఉద్రిక్తతలు..
.
బెంగాల్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తగ్గలేదు. దీంతో సుబేందు తప్పించుకొని పొలాల్లోకి పరిగెత్తారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు రాగా స్థానికులతో వాగ్వాదం జరిగి ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం.
ఇలాంటి చెదురుమదురు సంఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకుంటున్న ఈవీఎంలకు కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
CLICK HERE TO READ MORE : Rs61cr | ఏపీ మహిళకు అదిరిపోయే శుభవార్త
CLICK HERE TO READ MORE :