ఆర్టీసీ ఉద్యోగులకు సీసీఎస్ వజ్రోత్సవ గిప్ట్‌లు…

ఆర్టీసీ ఉద్యోగులకు సీసీఎస్ వజ్రోత్సవ గిప్ట్‌లు…

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఏపీఎస్ ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని సీసీఎస్ ఎంసీ మెంబర్ ఎన్.అనంతరాములు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వేణు, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావుకు మిల్టన్ స్టీల్ బాడీ (నాలుగు కప్పుల) క్యారియర్ ను గురువారం అందజేసి ప్రారంభించారు. డిపోలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ గిఫ్ట్ అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 విశాఖపట్నం సీసీఎస్ బోర్డు సర్వసభ్య సమావేశంలో ఉద్యోగులకు ఉపయోగకరమైన అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

సీసీఎస్ వజ్రోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రతి సభ్యుడికి రూ.1200 విలువైన మిల్టన్ స్టీల్ బాడీ క్యారియర్ ను అందించేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. రుణాలపై ఇంతవరకు ఉన్న ఇన్సూరెన్స్ 2.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం వల్ల రూ.10 లక్షల రుణంపై రూ.50 వేలు ఇన్సూరెన్స్ ఉద్యోగులకు తగ్గుతుందన్నారు. ఎమర్జెన్సీ పై మెడికల్ రుణం రూ.50 వేలు సదుపాయం టేక్ హోమ్ పే తో సంబంధం లేకుండా ఇస్తారని చెప్పారు.

రిమూవల్ లో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని రుణం మొత్తం మాఫీ అవుతుందన్నారు. ఎస్ బీఐ లైఫ్ వారు ప్రవేశపెడుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉద్యోగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉద్యోగి అభ్యర్థన మేరకు సీసీఎస్ ప్రత్యేక రుణం మంజూరు చేస్తుందన్నారు. ఎడ్యుకేషన్ రుణం రూ.7 లక్షల నుంచి రూ.7.50 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇలాంటి ఎన్నో ఉపయోగపడే సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఇన్ చార్జి కోటియా నాయక్, ట్రాఫిక్ ఇన్ చార్జి జ్యోతి బాబు, ఎన్ఎంయూఏ సెక్రటరీ పసుపులేటి శ్రీనివాసరావు, అధ్యక్షుడు బి.వి.ఆంజనేయులు, సహాయ కార్యదర్శి శేఖర్, ఎంప్లాయీస్ సెక్రటరీ నాగేశ్వరరావు, ఏడీసీ అరవింద్, డిపో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply