రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
ఆగి ఉన్న టిప్పర్ ఢీకొని…
జన్నారం,ఏప్రిల్ 21 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న టిప్పర్ ఢీకొని యువకుడు మంగళవారం రాత్రి 7:30 గంటలకు అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన బిల్ల మహేందర్(45) మంగళవారం రాత్రి టీఎస్ 19జే 3 0 9 1 మోటార్ సైకిల్ పై వెళ్తూ రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ వాహనాన్ని తపాల్ పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఢీకొట్టాడు.దీంతో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వృత్తిరీత్యా మంచిర్యాల ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసం ఉండి మార్బుల్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ రాత్రి సంఘటన సంఘటన స్థలానికి వెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
