శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి
శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని శ్మశాన వాటికలో అధికారులు వెంటనే వీధిదీపాలను ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్ సంగు భూపతి మంగళవారం కోరారు. దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలో ఆలస్యం అయినప్పుడు చిమ్మ చీకటిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్ఫోన్, బ్యాటరీలతో దహన క్రియలు చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడడం గమనించిన తాను ఆవేదన చెంది తన సొంత నిధులతో నాలుగు విద్యుత్ స్తంభాలను రెండు నెలల క్రితం అక్కడ ఏర్పాటు చేశానని భూపతి చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ విద్యుత్ స్తంభాలకు వెంటనే కేబుల్ ఏర్పాటు చేసి ట్యూబ్లైట్లను బిగించాలని కోరారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తాను తీసుకువెళ్లానని ఆయన చెప్పారు.
