అనాధ చిన్నారులకు అన్నితామైన తండావాసులు

సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : అనాధలైన చిన్నారులకు దిక్కెవరు ఆంధ్రప్రభ లో వచ్చిన కథనానికి స్పందించి ఆ తండాకు చెందిన సర్పంచ్ రాము నాయక్, గ్రామ యువకులు మోహన్ ఆధ్వర్యంలో గ్రామస్తుల తరఫున 43 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కడపగండి తండాకు చెందిన మూడవత్ సక్రు పద్మ దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు వీరికి ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రుల అకాల మరణంతో అనాధలుగా మారారు. దీంతో చలించిన గ్రామస్తులు ఆ ముగ్గురు చిన్నారులకు అండగా నిలిచారు. పల్లగట్టు తండాకు చెందిన గ్రామస్తులు 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు యువకులు అనాధలైన చిన్నారులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ముగ్గురు చిన్నారులను ఆదుకోవాలని కోరారు.
