vishnu priya| బుల్లితెర న‌టి హాట్ ఫొటోలు

vishnu priya| బుల్లితెర న‌టి హాట్ ఫొటోలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీవీ యాంకర్‌గా విష్ణు ప్రియ భీమినేని అంద‌రికీ సుప‌రిచిత‌మే.. పలు టీవీ షోల ద్వారా ఆమె అలరించింది. లక్షలాది మంది ప్రేక్షకులను, వేలాది మంది ఫాలోవర్స్ ను సంపాదించకుంది. ఇక విష్ణుప్రియ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట “పోవే పోరా” వంటి షోలతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన చురుకైన యాంకరింగ్ స్టైల్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తర్వాత రియాలిటీ షోలలో, ముఖ్యంగా బిగ్‌బాస్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని మరింత పాపులారిటీ సాధించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె తన ఇమేజ్‌ను మార్చుకుంటూ గ్లామర్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వెండి తెర‌మీద‌కు త‌న ప్ర‌తిభ‌ను చూపింది. ప్రస్తుతం ఆమె ఒక వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్, టెలివిజన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విష్ణుప్రియ తన కొన్ని ప్రత్యేక కంటెంట్‌ను చూడాలంటే డబ్బులు చెల్లించాలనే విధంగా ప్రచారం చేస్తున్నారని AISF నాయకులు ఆరోపించారు. ఈ విధానం కేవలం పాపులారిటీ కోసం కాకుండా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను ఇలాంటి విధంగా ఉపయోగించడం సరైంది కాదని, ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని వారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply