అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు..

అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లిలో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా పుట్టిన రోజు వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. స్థానిక షా బుఖారి బాబా ఆస్థానంలో సర్వమత ప్రార్థనలు చేశారు. ఇస్లాం మత గురువులు, ఇబ్రహీంపట్నం పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు, అర్చకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పాస్టర్లు దేవుని వాక్యంతో కూడిన జ్ఞాపికను బహూకరించారు.
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ ఎలీషా మాట్లాడుతూ.. అల్తాఫ్ బాబా అందరివాడని, మత గురువులకు ఆంధ్ర సింహం లాంటివారని ప్రశంసించారు. ఆయన సేవలు ఎంతో అభినందనీయమని, ప్రభువు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తెలిపారు. అనంతరం అల్తాఫ్ బాబాకు దేవుని ఆశీస్సులు ఉండాలని, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బాలరాజు ప్రార్థించారు. కొండపల్లి శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం కమిటీ సభ్యులు సాయిబాబా చిత్రపటం అందజేశారు. అర్చకులు ప్రత్యేక పూజ చేసి ప్రసాదాలు అందజేశారు. అన్ని మతాలను ఆదరిస్తున్న అల్తాఫ్ బాబా ఎంతో అభినందనీయులని, ఆయన సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పామర్తి రాంబాబు, కమిటీ సభ్యులు జవహర్ లాల్, మురళి పాల్గొన్నారు.

