ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

  • ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని గడ్డిపల్లి మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జె. ప్రసన్నకుమారి తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి సూచనలను అనుసరించి, ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే వారికి, ఫెయిల్ అయిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.

ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.

బయటి ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థినులకు కళాశాలలో హాస్టల్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply