పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
50మందికి రూ.48,10,441లు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం
కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1,318 మందికి రూ.10.89 కోట్లు సీఎంఆర్ఎఫ్ సహాయం
అవనిగడ్డ: పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు యాభై మందికి రూ.48,10,441లు విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1,318 మందికి రూ.10.89 కోట్లు సీఎంఆర్ఎఫ్ సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. నిరుపేదలు తమ వైద్య అవసరాల కోసం ప్రభుత్వ సహాయం కోరుతూ సమర్పించే దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీలు, రీ-ఎంబర్సుమెంట్ సహాయం అందిస్తోందని తెలిపారు.
