ఈనెల 19న హిందూ సమ్మేళనం

ఈనెల 19న హిందూ సమ్మేళనం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో ఈ నెల 19వ తేదీన ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ హిందూ సమ్మేళనా సమితి సభ్యులు చౌటుప్పల్ పురపాలికలోని వివిధ వార్డులలో గృహ సందర్శనం చేస్తూ గృహస్థులకు ఆహ్వాన పత్రికలను అందిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ హిందూ సమ్మేళనంనకు ముఖ్యఅతిథిగా త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవా సమితి వాసుదేవానంద సరస్వతి ముఖ్య వక్తగా, తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ జిన్న సత్యనారాయణ రెడ్డి, మహిళా వక్తగా ప్రముఖ సామాజిక వేత్త పర్వతం సంధ్యారాణిలు ఈ సమ్మేళనంనకు రానున్నట్లుగా హిందూ సమ్మేళన సమితి సభ్యులు తెలిపారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు ప్రతి హిందూ గృహం పైన కాషాయ ధ్వజం ఎగరవేయాలని సూచించారు.
హిందూ సమ్మేళన సమితి మండల అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు ఆధ్వర్యంలో సమితి ప్రతినిధులు బడుగు శ్రీరాములు, బొబ్బిళ్ళ మురళి, కొసనం రామ్ రెడ్డి, కర్నాటి శ్రీనివాసులు, పోలోజు శ్రీనివాసాచారి, డాక్టర్ అవ్వారు శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ వేముల నరసింహ, మంచికంటి భాస్కర్, ఉప్పల కృష్ణ, జక్కర్తి శేఖర్, ఆముదాల పరమేష్ తదితరులు హిందూ సమ్మేళనం విజయవంతం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
