Brahmastra part 2 | నిజంగా ఉంటుందా..?

Brahmastra part 2 | నిజంగా ఉంటుందా..?
Brahmastra part 2 | బ్రహ్మాస్త్రపై వచ్చిన హైప్ & నిరాశ
సీక్వెల్‌పై అఫీషియల్ క్లారిటీ
ఫ్లాప్‌కు అసలు కారణం ఇదే
పార్ట్ 2లో ఎవరు నటించబోతున్నారు..?
Brahmastra part 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బ్రహ్మాస్త్ర.. ఇది బాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి లాంటి భారీ సినిమా అని ప్రచారం చేశారు. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్, నాగార్జున.. ఇలా భారీ తారాగణంతో రూపొందింది. కరణ్ జోహార్ బాగా ప్రమోట్ చేశారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే.. సినిమా బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని అనౌన్స్ చేశారు. ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ చేయడం ఏంటి..? అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయ్యింది..? నిజంగానే సీక్వెల్ తీస్తారా..?
Brahmastra part 2 | కథ పై కసరత్తు చేస్తున్న ఆయాన్..

బాలీవుడ్లో భారీ స్థాయి విజువల్ ఫాంటసీ సినిమాగా నిలిచిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కు సీక్వెల్ పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా బ్రహ్మాస్త్ర 2 తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర 2 ఖచ్చితంగా వస్తుంది అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న భారీ ప్రాజెక్ట్ రామాయణ పూర్తయ్యాక వెంటనే.. ఈ సీక్వెల్ పై వర్క్ స్టార్ట్ చేస్తామని తెలియచేశారు. అయాన్ ముఖర్జీ ఆల్రెడీ ఈ సినిమా కథ పై కసరత్తు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
Brahmastra part 2 | అసలు కారణం ఇదే..

అసలు ఎందుకు బ్రహ్మాస్త్ర మూవీ ఫ్లాప్ అయ్యింది అంటే… ఈ సినిమా పై మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం వలన కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. దాదాపు 400 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తే.. ఓ 100 కోట్లు లాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీంతో కరణ్ జోహార్ సీక్వెల్ గురించి ఏం మాట్లాడలేదు. అయితే.. ఇప్పుడు రామాయణ నిర్మాత నమిత్ ఈ సినిమా సీక్వెల్ తీస్తానని ప్రకటన చేయడం విశేషం. అయితే.. ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఏంటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి కానీ.. సరిగ్గా తీస్తే.. ఈ సీక్వెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేయచ్చు అని నమిత్ బలంగా నమ్ముతున్నారు. అందుకే సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారట.
Brahmastra part 2 | పార్ట్ 2 లో నటించేది ఎవరు…?

బ్రహ్మాస్త్ర మూవీలో హీరోగా నటించింది రణబీర్ కపూర్. ఆయనే రామాయణలో రాముడు పాత్ర పోషిస్తున్నారు. ఈ హీరోతో నమిత్ కు మంచి అనుబంధం ఏర్పడిందట. అందుకనే రామాయణ తర్వాత రణ్ బీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తీయాలని ఫిక్స్ అయ్యారట. అయితే.. బ్రహ్మాస్త్రలో రణ్ బీర్ కపూర్ పోషించిన శివ పాత్రతో పార్ట్ 1 నడిచింది. ఇప్పుడు శివ తండ్రి పాత్ర దేవ్ ఆధారంగా పార్ట్ 2 ఉంటుందట. అయితే.. తండ్రి పాత్రలోనూ.. రణ్ బీరే నటిస్తాడా..? లేక వేరే హీరో నటిస్తారా..? అమితాబ్, నాగ్ క్యారెక్టర్స్ ఉంటాయా..? ఉండవా..? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

