సుజనా చౌదరి కార్యాలయంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ….

సుజనా చౌదరి కార్యాలయంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ….
భవానిపురం, ఆంధ్రప్రభ : భవానీపురం లోని సుజనా చౌదరి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబందించిన చెక్కుల పంపిణీ జరిగింది. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలు డివిజన్లలో అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకున్నారు. వారి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే సుజనా చౌదరి ని సంప్రదించారు. వారి చికిత్సకు అయిన ఖర్చుల మొత్తాన్ని ఆర్ధిక సాయం చేయాలంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీయం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాశారు. మొత్తం 63 లేఖలకు సంబందించి 37,22,102 రూపాయల మొత్తం విడుదల అయింది.
మొత్తం 63 చెక్కులను గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్దిదారులకు అందచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ ఊర్మిల నగర్ మండల అధ్యక్షుడు పగడాల కృష్ణ, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య జనసేన పార్టీ 41వ డివిజన్ అధ్యక్షుడు కూరాకుల సురేష్, 41వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు జై బాలన్, 39 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్, 40 వ డివిజన్ టిడిపిపార్టీ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, 44వ డివిజన్ బిజెపి అధ్యక్షులు రెడ్డిపల్లి రాజ, 34వ డివిజన్ టిడిపి అధ్యక్షులు అట్లూరి కొండ, 34వ డివిజన్ బిజెపి అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు సోమేశ్వరరావు, 37వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు.
