విజయవాడలో విషాదం..

విజయవాడలో విషాదం..
అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం, సిలిండర్ పేలి ఒకరు మృతి
పటమట, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని పటమట లంక ప్రాంతంలోని ప్రత్యూష అపార్ట్మెంట్‌లో మంగళవారం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎండల తీవ్రత మధ్య ఎయిర్ కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాల్కనీ గోడ పూర్తిగా ధ్వంసమై రాళ్లు చుట్టుపక్కల పడటంతో అపార్ట్మెంట్ వాసుల్లో పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకు గోడ రాయి బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీస్లు కేసు నమోదు చేసి ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, అధికారిక నిర్ధారణ కోసం విచారణ కొనసాగుతోంది. స్థానికంగా అత్యవసర సేవల స్పందన కొనసాగుతోంది.


