Peddi | రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..?

Peddi | రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..?
Peddi | పెద్ది రిలీజ్‌పై కొనసాగుతున్న అనిశ్చితి
వాయిదాపై విమర్శలు, సోషల్ మీడియాలో చర్చ
టాక్సిక్ సినిమా ప్రభావం ఉందా?
కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు
Peddi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఇది పుకారేమో అనుకున్నారు జనాలు. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగానే పెద్ది సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అయితే.. జూన్ లో పెద్ది వస్తుంది అంటూ ప్రకటించారు కానీ.. ఎప్పుడు వస్తుందో డేట్ అనౌన్స్ చేయలేదు. దీంతో పెద్ది భయపడుతున్నాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి.. పెద్ది డేట్ ఎందుకు చెప్పలేదు..? నిజంగానే భయపడుతున్నాడా..?
Peddi | పెద్ది పై విమర్శలు..

మార్చి 27న పెద్ది సినిమా రిలీజ్ కావాలి కానీ.. అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ కాలేదు. అందుకని ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఈసారి కూడా పెద్ది పోస్ట్ పోన్ కావడం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తే.. ఇదేదో గాసిప్ అనుకున్నారు. అయితే.. ఇది నిజంగా నిజం. పెద్ది సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. జూన్ లో పెద్ది సినిమాను రిలీజ్ చేస్తున్నామని.. మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే.. డేట్ ఎప్పుడు అనేది ప్రకటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
Peddi | టాక్సిక్ కోసం వెయిటింగా..

ఇప్పటికే పెద్ది రెండుసార్లు విడుదల తేదీ మార్చుకుంది. ఈ నేపథ్యంలో, మరోసారి కొత్త డేట్ ప్రకటించి అది కూడా మారిపోతే ప్రేక్షకుల్లో పూర్తిగా నమ్మకం కోల్పోతామన్న ఆందోళన ఉండొచ్చు. అందువలనే డేట్ ప్రకటించలేదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు జూన్ నెలలో మరో భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆ సినిమా రిలీజ్ డేట్‌ను దృష్టిలో ఉంచుకుని పెద్దికి డేట్ నిర్ణయించాలి అనుకుంటున్నారట. టాక్సిక్ ను మార్చి 19న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, తర్వాత దాన్ని జూన్ 4కు వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా టాక్సిక్ వస్తుందా..? రాదా..? అనే డౌట్ ఉంది. అందుచేత టాక్సిక్ రిలీజ్ ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో పెద్ది న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా.. పెద్ది రిలీజ్ పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే..

