చలివేంద్రం ప్రారంభం..

చలివేంద్రం ప్రారంభం..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలం దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజలందరికీ త్రాగునీరు అందించాలనే లక్ష్యం మేరకు ఆళ్లపల్లి మండల కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి వల్లాల శిరీష తెలిపారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి సర్పంచి వాసం సుష్మిత, స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్, వ్యవసాయ అధికారి కుమార్రాజాల సంయుక్తంగా కలిసి ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ సుస్మిత మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అనేక మంది సామాజిక కార్యక్రమాల్లో ప్రజల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పంచాయతీ సెక్రెటరీ వల్లాల శిరీషని ఆదర్శంగా తీసుకొని మండలంలో మరింత మంది ముందుకు రావాలన్నారు.
ఎస్ఐ సోమేశ్వర్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 12 పంచాయతీల కార్యదర్శులు, సర్పంచుల ఆధ్వర్యంలోని ప్రజలకు చలివేంద్రం కేంద్రాలను విరివిరిగా ప్రారంభించాలని కోరారు. వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు తీవ్రంగా పెరుగుతుందని, వైద్యశాలకు, తాహసిల్దార్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం వివిధ రకాలతో వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రజలు, రోగులు వచ్చి పోయే వారందరికీ ఏర్పాటు చేయబోయే చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆళ్లపల్లి పంచాయతీ కార్యదర్శి వల్లాల శిరీష ప్రజల పట్ల ఎంతో మక్కువ చూపి ప్రజల సమస్యలను గుర్తించి సమర్థవంతంగా అభయాంజనేయ సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం కమిటీ సంఘం మండల అధ్యక్షులు పరమ ప్రభుదాస్, రత్తయ్య, చంద్రబాబు, ముసలయ్య, కుమారి, ఏలియా, భూషణం, హోంగార్డ్ కన్నయ్య, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం దృష్ట్యా మంచి నీటి సౌకర్యం కల్పించడంతో మహిళలు, రైతు కూలీలు, విద్యార్దులు సైతం స్థానిక పంచాయతీ పాలక వర్గం సభ్యులను ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
