ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు…

ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు…
మిడ్జిల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135 వ జయంతి సందర్భంగా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ చిట్టెంపల్లి సుజాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ… దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.

ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. అంబేడ్కర్జీ జీవితం సామాన్య స్థితి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం అని అన్నారు. అంబేడ్కర్ గొప్ప సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని చిట్టెంపల్లి సుజాత మల్లికార్జున్ రెడ్డి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ మంగళగిరి రాణిబాయి రాంబాబు, మాజీ సర్పంచ్ కర్రోళ్ల జంగయ్య, రాజేందర్‌రెడ్డి, బాల్‌రాజు గౌడ్, కిష్టారెడ్డి, జైపాల్‌రెడ్డి, వార్డు మెంబర్లు లింగంపేట బాలమ్మ, జోగి లక్ష్మయ్య, లింగసానిపల్లి శ్రీలత, యువకులు లింగసానిపల్లి బాలరాజు, వాడ్యాల బాలమైసయ్య, వాడ్యాల యాదగిరి, వాడ్యాల శ్రీశైలం, వాడ్యాల రేణుక, జోగి చెన్నయ్య, మల్లెపోగు అమృతయ్య, జోగి సురేష్, జోగి రాజు, వాడ్యాల ప్రకాష్, కర్రోళ్ల లాలయ్య, బి. వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.


