మక్కల కొనుగోలులో మార్క్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం

మక్కల కొనుగోలులో మార్క్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం

వర్ధన్నపేట ఆంధ్రప్రభ: మక్కల కొనుగోలు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ లో మొక్క జొన్నల కొనుగోలు కేంద్రంలో మార్క్ ఫెడ్, సొసైటీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. బుధవారం ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. వారి నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. మొక్కజొన్నలు కాంటాలు ఆలస్యం కావడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంటాలైన వాటిని తరలించడానికి ట్రాన్స్పోర్ట్ సమకూర్చడంలో అధికారులు విఫలం చెందరన్నారు. కాంటాలు నత్త నడక నడుస్తున్నాయని, వెంటనే రైతుల మక్కలు కాంటాలు అయ్యే విధంగా ట్రాన్స్పోర్ట్ సమకూర్చి కాంటాలను చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కాంటాలైన మొక్క జోన్నను అన్లోడ్ చేయకుండా రిటర్న్ పంపిస్తున్నారని రైతులు మండిపడ్డారు. మా మక్కలు కొనుగోలు చేసేదాకా ధర్నా విరమించేది లేదని రోడ్డుపై రైతులు కూర్చున్నారు.

విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి కాంటాలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చ చెప్పడంతో ధర్నా నిలిపివేశారు.
ప్రైవేట్ వ్యాపారస్తులు బయట నుండి మక్కలు తీసుకువచ్చి మార్కెట్లో పోసి అధిక మొత్తంలో కాంటాలు పెడుతున్నందున రైతుల మక్కలు కాంటాలు ఆలస్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారస్తులు సొంత వెహికల్ పెట్టుకుని మక్కలు తరలిస్తుండడంతో వ్యాపారస్తుల కాంటాలు తొందరగా అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఎవరో వ్యాపారస్తులు ఎవరో తెలుసుకొని రైతులను గుర్తించి మక్కలు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి, పింగిలి సంపత్ రెడ్డి, వడ్డే దేవేందర్, మహిళా రైతు సొల్లేటి హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply