రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత

రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత
ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు..
జైనూర్, ఆంధ్రప్రభ : ముందస్తు సమాచారం మేరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కిరాణా వ్యాపారులు రేషన్ కార్డు (పిడిఎస్) బియ్యం అమ్ముతున్నారని సమాచారంతో మంగళవారం తనిఖీలు చేసి పిడిఎస్ బియ్యం, బెల్లం పట్టికలను స్వాధీనం చేసుకున్నట్లు జైనూర్ ఎస్సై రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సమాచారం ప్రకారం మండల కేంద్రంలోని గో పాల్ కిరాణ 40 క్వింటాళ్ల బియ్యం, శ్రీ రాజేశ్వర కిరాణ లో 13 క్వింటాళ్లు, జనతా కిరాణాల్లో 11 క్వింటాళ్లు బియ్యం పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని అదే విధంగా జనతా కిరణ దుకాణంలో 130 కిలోల బెల్లం, 92 కిలోల పట్టిక పట్టుకొని స్వాధీనం చేసుకుందామని ఎస్సై తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన కిరాణా షాప్ ల యజమానులు గోపాల్, రమేష్, తోఫిక్ వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

ప్రభుత్వపరంగా రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు బ్లాక్లో విక్రయించడం నేరమని, రేషన్ కార్డుదారులు కూడా పిడిఎస్ బియ్యాన్ని బ్లాక్లో అమ్ముడం నేరమని ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాగే పిడిఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన అమ్మిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవికుమార్ తెలిపారు.
