నిద్రిస్తుండగా.. కుటుంబం మొత్తం…

నిద్రిస్తుండగా.. కుటుంబం మొత్తం…
బిహార్ : బిహార్ లోని దానాపూర్ (Danapur) ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో రాత్రి దారుణ విషాదం చోటుచేసుకుంది. ఆకస్మికంగా ఇంటి పైకప్పు కూలిపోవడంతో, నిద్రలో ఉన్న ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో మహ్మద్ బబ్లు (Mohammed Bablu) (35), ఆయన భార్య రోషన్ ఖటూన్ (Roshan Khatun) (30), వారి పిల్లలు రుసర్ (Rusar) (12), మహ్మద్ చంద్ (Mohammed Chand) (10), చాందినీ (Chandni) (2) ఉన్నారు.
ఈ ఘటన గ్రామంలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్థానికులు రాత్రి శబ్దం విని అక్కడికి చేరుకుని, శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఎవరినీ రక్షించే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు (case Registration) చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి నిర్మాణంలో లోపాలు లేదా వృద్ధాప్యం కారణంగా పైకప్పు కూలినట్టు ప్రాథమిక అనుమానం వ్యక్తమవుతోంది. ఈ దుర్ఘటనపై గ్రామంలో దుఃఖం వాతావరణం నిండిపోయింది.
