రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఐ సంజీవరెడ్డి అరైవ్- అలైవ్ నినాదంతో “రోడ్డు భద్రత” పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడరాదని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, అతివేగంగా వాహనాలు నడపరాదని, హెల్మెంట్, సీట్ బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని ,మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ఇలాంటి ఘటనలు చట్టపరమైన నేరమని, రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానాతోపాటు, శిక్షకు గురవుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాములు, సర్పంచ్ నామని జగన్నాథం, డీసీసీ ఉపాధ్యక్షులు దండు యాదగిరిరెడ్డి, వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
