అంబేద్కర్ ఆలోచనలే మార్పుకు మార్గం-జ్ఞానమే శక్తి

అంబేద్కర్ ఆలోచనలే మార్పుకు మార్గం-జ్ఞానమే శక్తి
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల పుర పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పుర చైర్పర్సన్ పందిరి గీత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు, న్యాయకోవిధుడు, రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ ప్రదాత, ప్రగాఢ దేశభక్తుడు అయిన అంబేద్కర్ ను కులం ఆధారిత రిజర్వేషన్ అంశానికి పరిమితం చేయడం శోచనీయమని అన్నారు. అంబేద్కర్ కేవలం స్వతంత్ర భారతదేశాన్ని మాత్రమే ఊహించలేదు, న్యాయ సమ్మతమైన ఒక విశ్వ గురువుగా భావించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
