బావిలో దూకి మహిళ ఆత్మహత్య

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

​చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని చల్లగరిగ గ్రామంలో మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటచేసుకుంది. గ్రామస్తులు, చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చల్లగరిగ గ్రామానికి చెందిన మ్యాదరి మల్లేష్, భార్య మ్యాదరి పద్మ (46) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఇబ్బంది పడుతోంది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన క్రమంలో, ఆమె ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ​సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ముచినిపర్తి వెళ్లే దారిలో ఉన్న బావిలో పద్మ మృతదేహం తేలి ఉండటం గమనించారు. మృతదేహాన్ని బయటకు తీసి చిట్యాల సివిల్ హాస్పిటల్ కు పోస్టుమార్టం తరలించారు. మృతురాలి భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply