అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు

  • మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దని మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి-నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా నేడు భారత్ లో ప్రజాస్వామ్యం అత్యంత భద్రమైన స్థానంలో ఉందన్నారు.

నవ భారత నిర్మాత అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారని వివరించారు. అనంతరం పంచశీల జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు అవునూరి లచ్చన్న, జిల్లా నాయకులు శనిగారపు లింగన్న, మండల అధ్యక్షులు రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, అధిక సంఖ్యలో నాయకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Leave a Reply