ర్యాంకుతో మెరిసిన రైతు బిడ్డ..

ర్యాంకుతో మెరిసిన రైతు బిడ్డ..

​ములకలపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక సామాన్య రైతు బిడ్డ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన రాధారాపు త్రివిక్రమ్, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో స్టేట్ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ​​త్రివిక్రమ్ రఘునాథపాలెంలోని ఎంజెపి టిబిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపిసి గ్రూపు చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ​మొత్తం మార్కులు1000 లకు గాను 990 మార్కులు ​సాధించాడు.

​తల్లిదండ్రుల హర్షం: ​కుమారుడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించాడని తెలుసుకున్న త్రివిక్రమ్ తల్లిదండ్రులు రాధారాపు హుస్సేన్, మైబీలు అమితానందం వ్యక్తం చేశారు. ఒక రైతు బిడ్డగా ఉంటూ, కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంతోషాన్ని చూసి త్రివిక్రమ్ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ​రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన త్రివిక్రమ్‌ను గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు, పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply