రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు…

రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు…
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం చిట్యాల పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో మెరిసే ఏకంగా మొదటి ర్యాంక్ సాధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ సంవత్సర ఫలితాలలో చిట్యాల పట్టణానికి చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి పట్టణ కీర్తిని చాటి చెప్పారు. ముఖ్యంగా ఎంపీసీ విభాగంలో విద్యార్థినులు పోటాపోటీగా మార్కులు సాధించి తమ సత్తా చాటారు.
చిట్యాల పట్టణానికి చెందిన జనంపల్లి గురుకుల కళాశాలలో చదువుతున్న కన్నబోయిన తపస్వి, హయత్ నగర్ చైత్ర జూనియర్ కళాశాలకు చదువుతున్న మహేశ్వరం బృంద , బొబ్బల రక్షిత, ముగ్గురు విద్యార్థులు 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచారు.విద్యార్థినుల అద్భుత విజయం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేస్తున్నారు. కఠిన శ్రమ, క్రమశిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించిన అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.
