కస్తూర్బా గాంధీ బాలికల హవా..

కస్తూర్బా గాంధీ బాలికల హవా..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వెలువడిన ఫలితాల్లో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ స్వప్న మాట్లాడుతూవిద్యార్థుల ఫలితాలను వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 965/1000 మార్కులతో సౌజన్య కాలేజ్ టాపర్గా మొదటి స్థానంలో వర్షిత 961/1000 రెండవ స్థానం, ద్వితీయ సంవత్సరం బైపిసిలో సాయి ప్రియ 940/1000 మొదటి స్థానం, 914/1000 మాధవి ద్వితీయ స్థానంలో అత్యధిక మార్కులు సాధించారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 447/470, గాయత్రి 432/470, తేజస్విని బైపిసి గ్రూపులో అక్షయ 423/440 మార్కులు, వైష్ణవి419/440 ప్రధమ ద్వితీయ స్థానంలో మార్కులు పొందారు కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100% ఉత్తినే తప్పుంది అత్యుత్తమ ప్రతిభలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ నాగపురి స్వప్న కళాశాల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

Leave a Reply