పేదలకు సేవే పరమావధి…

పేదలకు సేవే పరమావధి…
కళ్ళే లలిత వీధిలో 53నెలలు నుండి ప్రతి నెల అన్నసమారాధన…
ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు...
పాయకాపురం, ఆంధ్రప్రభ : పేదలకు సేవచేయడమే పరమావధి అని కళ్ళే లలిత ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ కళ్ళే లలిత వీధిలో గత 53నెలలు నుండి ప్రతి నెల పేదలకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం పేదలకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్ళే లలిత ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు పాల్గొని స్వర్గీయ కళ్ళే లలిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు.
సింగ్ నగర్ ప్రాంతంలో స్వర్గీయ కళ్ళే లలిత జ్ఞాపకార్ధం, కళ్ళే లలిత వీధిలో ప్రతి నెల అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ట్రస్ట్ డైరెక్టర్లు సేవలు ఎనలేనిదని అన్నారు. స్వర్గీయ కళ్ళే లలిత భౌతికంగా దూరమైన నాటి నుండి ప్రతి నెల 12వ తేదిన క్రమం తప్పకుండా గత 53నెలలు నుండి పేదలకు సింగ్ నగర్ ప్రాంతంలోని కళ్ళే లలిత వీధి వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
తమకు కలిగిన ఆర్ధిక స్థోమత బట్టి పేదలకు ఆహారాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. కళ్ళే లలిత బ్రతికి ఉన్న రోజులలో పేదల ఆకలి తీర్చాలని తెలపడం జరిగిందని అందుకే ప్రతి నెల వారికి బోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కళ్ళే నాగేశ్వరరావు అన్నారు. రానున్న రోజులలో కళ్ళే లలిత ట్రస్ట్ సేవలు ద్వారా పేదలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్లు కళ్ళే సీతా మహాలక్ష్మిముప్పూరి హరీష్, ఎమ్.జశ్విన్, జి. ధ్రువన్, చందన సురేష్, ప్రసాద్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
