లక్ష్మీ గణపతి దేవాలయ ప్రతిష్టా ఉత్సవాల్లో ఎమ్మెల్యే…

లక్ష్మీ గణపతి దేవాలయ ప్రతిష్టా ఉత్సవాల్లో ఎమ్మెల్యే…

చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి ప్రధాన కూడలిలో చిన్నకార్ల స్టాండ్ వారు భక్తుల విరాళాలతో పునర్నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అతిధిగా నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ విచ్చేసి గర్భాలయంలో స్వామివారిని, నూతన ఉత్సవ మూర్తిని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకులు వేమూరి శ్రీనివాస శాస్త్రిచే ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

ఈ సందర్భంగా వారిని దేవస్థాన, టాక్సీ యూనియన్ కమిటీల గౌరవ అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు, ముమ్మనేని రాజకుమార్ (నానీ), కమిటీ పెద్దలు ఆత్మకూరి వెంకటేశ్వరరావు, నర్రా సురేంద్ర (చిన్ని) సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సజ్జా చలపతిరావు, సొసైటీ చైర్మన్ బొందలపాటి వీరబాబు, కూటమి నాయకులు, టాక్సీ యూనియన్ ప్రతినిధులు, దేవాలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతిష్ట సందర్భంగా సీఐ కే.ఈశ్వరరావు తమ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Leave a Reply