IPL2026 | పంజాబ్ ముందు భారీ లక్ష్యం!

IPL2026 | పంజాబ్ ముందు భారీ లక్ష్యం!

IPL2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు.

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), ట్రావిస్ హెడ్ (38) పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశారు.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ (27), హెన్రిచ్ క్లాసెన్ (39) కూడా అదే జోరు కొనసాగిస్తూ స్కోరును భారీగా తీసుకెళ్లారు. హైదరాబాద్ బ్యాటర్ల దూకుడుకు పంజాబ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, శషాంక్ సింగ్ రెండు వికెట్లు, బార్ట్‌లెట్ ఒక వికెట్ తీశారు.

ఇక మ్యాచ్ గెలవాలంటే పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 220 పరుగులు చేయాల్సి ఉంది. ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ, ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం శ్రేయాస్ అయ్యర్ సేనకు కఠిన సవాల్‌గా మారింది. సన్‌రైజర్స్ బౌలర్లు ఈ స్కోరును ఎలా కాపాడుకుంటారో చూడాలి.

Leave a Reply