ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి…

నివాళులర్పించిన టిడిపి కుటుంబ సభ్యులు…

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో టిడిపి డివిజన్ అధ్యక్షులు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు గోవిందరావు పూలే ప్రసిద్ధిగా మహాత్మా ఫూలే అని పిలువబడే ఆయన (1827 ఏప్రిల్ 11 – 1890 నవంబరు 28) కాలానికి చెందిన గొప్ప భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న ప్రజల హక్కుల కోసం పోరాటాలు చేసి, సత్య ధర్మశోధక మండలిని స్థాపించి, అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ ఘననివాళులు అర్పిస్తున్నామన్నారు.

కూటమి ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన దిశగా పాలన కొనసాగిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి కుటుంబ సభ్యులైన బీసీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి దుప్పల శివాజీ ముదిరాజ్, తమ్మిన శేకర్, నమ్మి భాను ప్రకాష్, తెలుగు యువత అధ్యక్షులు రాళ్లపల్లి మాధవ్, ఎన్టీఆర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ముర్రి అపర్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సoదక వెంకట్రావు, తెలుగు కోఆర్డినేటర్ అప్పన్న, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply