China Garage : శాంతి బురఖా Andhra Prabha Top Story

China Garage : శాంతి బురఖా Andhra Prabha Top Story

  • అటు ఆయుధాల ఆట
  • ఎఫ్-15 కూల్చివేతలో కొత్త ట్విస్ట్
  • ద్వంద్వ సాంకేతికతపై అనుమానాలు
  • రష్యా నిఘా సహకారం ఎంతవరకు?
  • మ్యాన్‌ప్యాడ్స్ ముప్పు ఎంత తీవ్రం?
  • కాల్పుల విరమణ వెనుక అసలు గేమ్

( ఆంధ్రప్రభ, బీజింగ్​ ప్రతినిధి)

China Garage

బ‌ల‌హీనుడ్ని బెదిరించ‌టం బ‌ల‌వంతుడి ల‌క్ష‌ణం.. ఇక్క‌డే ట్విస్ట్ ఉంది.. బ‌ల‌హీనుడి వెనుక ఓ శ‌క్తి ఉంది. అదే జ‌న‌తా గ్యారేజ్‌… ఇదీ ఓ సినీ హీరో డైలాగ్‌.. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ జ‌రిపిన ఆప‌రేష‌న్ ఎథిక్ ప్యూరీలో.. ఇరాన్ మ‌రీ బ‌ల‌హీనం. మ‌రి ఇరాన్ వెనుక జ‌న‌తా గ్యారేజీ ఎవ‌రిది ? ఇంకెవ‌రూ చైనాదేన‌ట‌. ఆ గ్యారేజీలో త‌యారు చేసిన అత్యాధునిక మిసైల్స్ తో అమెరికా విమానాల‌కు ఇరాన్ గురిపెడితే..

China Garage

ర‌ష్యా నిఘా వ్య‌వ‌స్థలు ఎస్వీఆర్‌, జీఆర్యూ జంట‌గా అమెరికా ఆనుపానుల‌ను ప‌సిగ‌ట్టి ఇరాన్ కు ఉప్పు అందించాయ‌ట‌. ఇదీ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వాప్త‌గా జ‌నం నోట్లో నానుతున్న ర‌హ‌స్యం. అయ్యో రామా.. యుద్దం వ‌ద్దు వ‌ద్దు అని అంద‌రికంటే ముందు గోల చేసిందే మేము.. ఇప్పుడు ఈ నీలాప‌నంద‌లేంటీ.. మ‌రీ న్యూసెన్సూ.. అని చైనా., ర‌ష్యా గ‌గ్గోలు పెడుతున్నాయి.

China Garage

ఇది స‌రే.. రెండు వారాల కాల్పుల విర‌మ‌ణ బుర‌ఖాలో అమెరికా, ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల కోసం పాపం పాకిస్థాన్ లో భేటీ అవుతుంటే.. అస‌లు ఈ రెండు దేశాల మ‌ధ్య రాజీ కుద‌ర‌ద‌ని.. ఈ మాటామంతీ ఇంట‌ర్ వెల్ లో ఎవ‌రికి వారే ఆయుధాల‌ను పేర్చుకుంటున్నార‌ని విశిశ్లేష‌కుల అంచ‌నా. ఇందులో ఎంత వ‌ర‌కూ నిజ‌ముందో లేదో గానీ.. తాజాగా చైనా గ్యారేజీ క‌థ తెరమీద వైర‌ల్ అవుతోంది.

China Garage : ​.. ఇదొక గ్యారేజ్​ స్టోరీ

China Garage

ఇటు పాకిస్థాన్ లో చ‌ర్చ‌లు ప్రారంభానికి ముందే.. అంటే రాబోయే వారాల్లో ఇరాన్‌కు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను అందించడానికి చైనా సిద్ధమవుతోందని సీఐఏ ఏజెంట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చెవిలో గుప‌గుస గొణుగుతున్న‌ట్టు స‌మాచారం. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విర‌మ‌ణకు ప్లాన్ సెట్ చేసింది తామేన‌ని చైనా చెబుతోంది. పాకిస్థాన్ ను తామే రంగంలోకి దించామ‌ని చైనా గొప్ప‌లు పోతోంది. త‌మ ప్రెస్ మీట్ క్లిప్పింగ్ లు సైత్వం త‌మ ఎక్స్ ఖాతాలో పోస్టుల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. ఒక వేళ ఇరాన్ కు ఆయుధాల‌ను పంపించే ప‌నిలో బీజింగ్ బిజీ బిజీగా ఉన్న‌ట్టు ట్రంప్ గ్ర‌హిస్తే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వ‌చ్చే నెల‌లో జ‌రిగే చర్చలకు ట్రంప్ డుమ్మా కొట్టేస్తారు.

China Garage : ఇక్క‌డే కొత్త ట్విస్ట్‌..

China Garage

గ‌త వారం ఇరాన్ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఉష్ణాన్ని పసిగట్టే ఓ భుజ క్షిపణి తో ఈ విమానాన్ని కూల్చిన‌ట్టు విలేకరుల సమావేశంలో ట్రంప్ వివ‌రించారు. ఆ విమానాన్ని తాము ఒక కొత్త వాయు రక్షణ వ్యవస్థను ఉపయోగించామ‌ని ఇరాన్ చెప్పింది, కానీ అస‌లు వివరాలను అందించలేదు. ఆ వ్యవస్థ చైనాలో తయారైందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ తమ సంయుక్త సైనిక చర్యను ప్రారంభించినప్పటి నుండి, ఇరాన్‌కు మ్యాన్‌ప్యాడ్స్‌ను పంపడం ఆ దేశానికి చైనా అందిస్తున్న మద్దతులో ఒక తీవ్రతను సూచిస్తుంది. నిజానికి ఇరాన్ ఆయుధాలను తయారు చేసుకోవడానికి, నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపర్చ‌టానికి వీలు కల్పించే ద్వంద్వ- వినియోగ సాంకేతికతను చైనా కంపెనీలు ఇరాన్‌కు విక్రయిప్తున్న‌ట్టు నిఘా వ‌ర్గాల అంచ‌నా. చైనా ప్రభుత్వం నేరుగా ఆయుధ వ్యవస్థలను బదిలీలో బ‌య‌ట‌కు క‌నిపించ‌దు. .

China Garage : ఇదొక దౌత్య బురఖా

China Garage

ఈ ఘర్షణలోకి బహిరంగంగా ప్రవేశించి, అమెరికా ఇజ్రాయెల్‌ల నుంచి ఇరాన్‌ను రక్షించే విష‌యంలో చైనాకు ఎలాంటి నిజమైన వ్యూహాత్మక ప్రయోజనం కనిపించడం లేదు, ఎందుకంటే ఆ పోరాటంలో గెలవడం అసాధ్యమని వారికి తెలుసు.ఇందుకు బదులుగా ఇరాన్‌కు నిరంతర మిత్రదేశంగా తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఎందుకంటే అది ఇరాన్ చమురుపై ఎక్కువగా ఆధారపడి ఉంది , అదే సమయంలో యుద్ధం ముగిసిన తర్వాత తమ ప్రమేయం లేదని ఇరాన్ నిరాకరించే వీలును కొనసాగించడానికి బాహ్యంగా తటస్థంగా ఉంటోంది.

ALSO READ : Minab 168 Flight : మినాబ్​ 168 ఆగమనం Andhra Prabha News

Leave a Reply