పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..!

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..!

  • వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
  • ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర అంగన్వాడీలదే….
  • సేవలు మెరుగైతే పిల్లలే కేంద్రానికి వస్తారు
  • టీచర్ల పనితీరు మెరుగు పర్చడానికి నూతన స్మార్ట్ ఫోన్ల పంపిణి…
  • సదుపాయాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజుల్లో స్వంత భవనాలు మంజూరు..
  • నియోజకవర్గాన్ని తెలంగాణకు మాడల్ గా నిలుపుదాం
  • స్మార్ట్ ఫోన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలని వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు పౌష్టికహారం అందించడంతో పాటు ఆరోగ్యా వంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర అత్యంత కీలక మైనదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవా రం స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణి కార్యక్రమానికి వరంగల్ పార్ల మెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వ్యవస్థను ఆధునికీకరించే దిశగా తీసుకుంటు న్న చర్యలు అభినందనీయమన్నారు. అంగన్వాడి టీచర్లపై ఉన్న పేపర్ వర్క్ భారాన్ని తగ్గిస్తూ, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. తల్లి, శిశు సంక్షేమంలో అంగన్వా డి కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో అంగన్వాడి టీచర్లు అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు.

పిల్లల మానసిక స్థితిని గుర్తించడం, వారి అభివృద్ధిని పర్యవేక్షించడం కూడా అంగన్వాడి సిబ్బంది బాధ్యతలో భాగమని తెలిపారు. చిన్నపిల్లలపై జరిగే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌ను నివారించేందుకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అవగాహన కార్యక్రమా లను నిర్వహించడం అవసరమని సూచించారు. ప్రతి మహిళ ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసుకో వాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియో గంతో అంగన్వాడి సేవలు మరింత వేగవంతంగా మారతాయి. లబ్ధి దారులకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామని తెలిపారు. భవి ష్యత్తులో అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

  • స్వంత భవనాలు నిర్మించి తెలంగాణకు మాడల్ గా నిలిపేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నియోజకవర్గంలోని ఎలాంటి మౌలిక సదుపాయాలు 108అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలను నెల రోజుల్లో మంజూరు చేయించి సం వత్సరం లోపు పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 100 శాతం అంగన్వాడీలకు స్వంత భవనాలు నిర్మించి తెలంగాణకు మాడ ల్ గా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నియో జకవర్గంలో 349 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి.

అందులో జనగామ జిల్లా పరిధిలో245 కేంద్రాలు, హన్మకొండ జిల్లా పరిధిలో 104 కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో ఏ విధమైన సదుపాయాలు లేకుం డా అద్దె భవనాలలో 108అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. హన్మ కొండ, జనగామ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడైతే అంగన్వాడీ భవ నాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం గాని, ప్రభుత్వ పాఠశాలలో అనువైన ప్రదేశం గాని ఉంటే వేంటేనే అక్కడ ఉపాధి హామీ నిధుల ద్వారా అంగ న్వాడీ భవన నిర్మాణాన్ని మంజూరు చెసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

-అంగన్వాడీ కేంద్రాలలోనే ప్రీ స్కూల్స్ ఏర్పాటు:

అంగన్వాడీ కేంద్రాలలోనే ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియం బోధన అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అత్యధిక పోషక విలువలు ఉన్న బాలామృతం అందిస్తున్నట్లు తెలి పారు. సీఎం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రాథమిక పాఠశాలలకు అనుబందంగానే ప్రీ స్కూల్స్ నిర్వహించనున్నట్లు వెల్లడిం చారు. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చాలా కష్టపడుతున్నారని పోటీపడి బాగా చదివించే ప్రయత్నం చేస్తు న్నారని తెలిపారు.

అలాగే మనం కూడా పోటీపడి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధన పద్ధతులు పాటించాలని, ఇందుకోసం ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్ర మాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, హన్మకొండ, జనగామ డిడబ్ల్యుఓలు విశ్వజ, కోదండరాం, సీడీపీఓ సరస్వతి, తహసీల్దార్, ఎంపీడివో, మున్సిపల్ కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply