CM Revanth | సీఎం రేవంత్ రెడ్డితో టిమ్ రిఫెల్ భేటీ

CM Revanth | సీఎం రేవంత్ రెడ్డితో టిమ్ రిఫెల్ భేటీ

CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో వైమానిక రంగానికి మరో కీలక అవకాశంగా సీ-130జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేసింది.

CM Revanth |

అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ హైదరాబాద్‌లో సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఆదిభట్లలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్)తో కలిసి విమానాల విడిభాగాల తయారీ చేపడుతున్న సంస్థ, ఇప్పుడు మరింత విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రిఫెల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్‌లో ఎఫ్-16 విమానాల వింగ్స్ ఉత్పత్తి కోసం టీఏఎస్‌ఎల్‌తో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన వివరించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉందని టిమ్ రిఫెల్ సీఎంకు తెలిపారు. ఈ ప్రతిపాదన అమలు అయితే హైదరాబాద్ వైమానిక రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply