నేటి నుండి ఫిజిక్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ….

నేటి నుండి ఫిజిక్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం నుంచి రెండు రోజులపాటు ఫిజిక్స్ నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని ఫిజిక్స్ విభాగం హెడ్ డాక్టర్ మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ పోస్టర్లను ఫిజిక్స్ విభాగం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅడ్వాన్స్‌డ్ సెమీ కండక్టర్స్ , ఫంక్షనల్ మెటీరియల్స్ అనే అంశం పై ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలిపారు.
మొదటి రోజు ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ప్రో.యాదగిరి రావు , గౌరవ అతిథులుగా ఐ ఐ సి టి ప్రధాన శాస్త్రవేత్త డా.అన్నదానం, సాయినాథ్ ,ప్రో.మధుకర్,రిటైర్డ్ ప్రొఫెసర్,ఉస్మానియా యూనివర్సిటీ, ముఖ్య వక్తగా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ప్రో.సూర్యనారాయణలు విచ్చేస్తున్నారు అని తెలిపారు. కాన్ఫరెన్స్ అంశంపై పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు భవిష్యత్తు సాంకేతికతకు బలమైన పునాది వేస్తాయి, కాబట్టి ప్రస్తుత అభివృద్ధి చెందిన దశలో ఈ పరిశోధనలు జరుగుతున్న క్రమాన్ని, వచ్చిన ఫలితాలను భవిష్యత్తు అవసరాలకు వినియోగించే విధంగా ఈ కాన్ఫరెన్స్ లో చర్చలు జరుగుతాయని తెలిపారు.
వివిధ విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను, పరిశోధనల ఫలితాలను పంచుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని కాన్ఫరెన్స్ లో పాల్గొని, నూతన ఆవిష్కరణ ల కొరకు జరుగుతున్న పరిశోధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాలలో ఫిజిక్స్ చదువుతున్న విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్ కి హాజరు కావాలని సూచించారు. కాన్ఫరెన్స్ విజయవంతం కై అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ విభాగం చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ హరిత లక్కరాజు, అధ్యాపకులు డాక్టర్ లలిత,వైశాలి, డాక్టర్ సరిత,దిలీప్, డాక్టర్ శ్రీ మాత ఫిజిక్స్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.
